పంచాయతీ కార్యాలయాల రంగుల విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ఆలోచన తమకు లేదని సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో కోర్టు తీర్పు వచ్చిన అనంతరం కొత్త రంగులు వేయలేదన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి గౌరవం ఉందని చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ కోర్టులో వేర్వేరుగా ప్రమాణపత్రాలు దాఖలు చేశారు.
క్షమించండి..!
లాక్డౌన్ ముగిశాక రంగులను తొలగించడానికి ఇదే హైకోర్టు ఇచ్చిన మూడు వారాల గడువు ఇంకా మిగిలే ఉందని అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించామని న్యాయస్థానం భావిస్తే క్షమాపణలు కోరుతున్నామన్నారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం పై విచారణను మూసివేయాలని అభ్యర్థించారు.