కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ - పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు వార్తలు
![కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ ap cs adityanath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10379444-321-10379444-1611591388144.jpg)
21:28 January 25
ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరుతున్నట్లు వెల్లడి
కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఎన్నికల దృష్ట్యా ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. ఇందులో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖల సిబ్బంది పాల్గొననున్నారని వివరించారు. .
పంచాయతీ ఎన్నికల కారణంగా కమిషన్ ఆదేశాల మేరకు చాలా మంది ఉద్యోగులకు వాక్సినేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందని లేఖలో ప్రస్తావించారు. సెషన్ సైట్ లలో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు