గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 61,148 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 328 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. గుంటూరు, కడప, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో వ్యక్తి చొప్పున మొత్తం నలుగురు మృతి చెందారు. తాజా గణాంకాలతో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,82,286కు చేరుకుంది.
మొత్తం కోటీ 18 లక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటీ 18 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8.71 లక్షల మందికి పైగా వైరస్ బారి నుంచి బయటపడినట్లు తెలిపింది. మరో 3,262 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 7,108 మంది మృతి చెందారని వివరించింది.
ఇదీ చదవండి:
గోవాలో 'న్యూ ఇయర్' వేడుకలు ఈసారి ఎలాగంటే!