సోమవారం శాసనసభలో ఆమోదించిన ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. నిన్న రాత్రే శాసనమండలి రద్దు తీర్మాన ప్రతి, ఓటింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ అందించింది. శాసనమండలి రద్దు.. వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించింది. శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోం, న్యాయశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. శాసనసభ తీర్మానాన్ని ఎన్నికల సంఘానికి కూడా ప్రభుత్వం అందించింది. కేబినెట్‌లో తీర్మానం అనంతరం అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెడుతుంది.
గంటల వ్యవధిలోనే... కేంద్రానికి మండలి రద్దు తీర్మానం - ఏపీ శాసనమండలి రద్దు వార్తలు
శాసనమండలి రద్దు ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. మండలి రద్దు నిర్ణయాన్ని సోమవారం కేబినేట్లో చర్చించి.. అనంతరం శాసనసభలో స్వయాన ముఖ్యమంత్రే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. రోజంతా మండలి రద్దు తీర్మానంపై శాసనసభ చర్చించింది. చివరకు ఓటింగ్లో 133 ఓట్లతో తీర్మానాన్ని ఆమోదించింది.
గంటల వ్యవధిలోనే... కేంద్రానికి మండలి రద్దు తీర్మానం