ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 82 మంది మృతి

AP Corona Latest update
కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 82 మంది మృతి

By

Published : Aug 13, 2020, 4:06 PM IST

Updated : Aug 13, 2020, 4:42 PM IST

16:00 August 13

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,996 కరోనా కేసులు నమోదవగా... 82 కరోనా మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 82 మంది మృతి

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,64,142కి చేరింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,378కి చేరింది. కరోనా నుంచి 1,70,924 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 55,692 మందికి కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 27.05 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 963, విశాఖ జిల్లాలో 931, అనంతపురం జిల్లాలో 856, పశ్చిమగోదావరి జిల్లాలో 853, కర్నూలు జిల్లాలో 823, కడప జిల్లాలో 784, నెల్లూరు జిల్లాలో 682, ప్రకాశం జిల్లాలో 681, గుంటూరు జిల్లాలో 595, విజయనగరం జిల్లాలో 569, శ్రీకాకుళం జిల్లాలో 425, కృష్ణా జిల్లాలో 330 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మృతులు...

తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో 10 మంది చొప్పున మృతిచెందారు. అనంతపురం జిల్లాలో 8, కడప జిల్లాలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతిచెందారు. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు.

ఇదీ చదవండీ... జైడస్​ కాడిలా 'కరోనా మందు' ధర ఎంతంటే?

Last Updated : Aug 13, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details