గత 24 గంటల్లో రాష్ట్రంలోని 89,087 నమూనాలను పరీక్షించగా.. 22,018 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. 19,177 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 2,03,787 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి వల్ల 96 మంది మృత్యువాత పడ్డారు. తాజా గణాంకాలతో.. ఏపీలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 13,88,803కి చేరింది. వారిలో 11, 75, 843 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 9,173 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో కొత్తగా 22,018 మందికి కరోనా, 96 మరణాలు - ఇవాళ రాష్ట్రంలో తాజా కరోనా కేసులు
16:59 May 14
కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. తాజాగా 22,018 మందికి కొవిడ్ నిర్ధరణ కాగా.. 96 మంది మరణించారు. 19,177 మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. మరో 2,03,787 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్‌పై హర్షవర్ధన్ కీలక సూచనలు
తాజాగా కేసుల్లో.. అత్యధికంగా తూర్పుగోదావరిలో 3432 మంది, అత్యల్పంగా శ్రీకాకుళంలో 695 మందికి కరోనా సోకింది. అనంతపురంలో 2213, చిత్తూరులో 2708, గుంటూరులో 1733, కడపలో 1460, కృష్ణాలో 1031, కర్నూలులో 1213, నెల్లూరులో 1733, ప్రకాశంలో 1265, విశాఖలో 2200, విజయనగరంలో 899, పశ్చిమగోదావరిలో 1436 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి అత్యధికంగా అనంతపురంలో 11, అత్యల్పంగా కడపలో నలుగురు మృతి చెందారు.
ఇదీ చదవండి: