corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,252 కరోనా కేసులు, 15 మరణాలు - ఏపీ కరోనా తాజా వార్తలు
![corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,252 కరోనా కేసులు, 15 మరణాలు ap corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12569188-806-12569188-1627213575663.jpg)
16:40 July 25
కరోనాతో 15మంది మృతి
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 84,858 పరీక్షలు నిర్వహించగా.. 2,252 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,54,765 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,256 కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,440 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,19,354కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,155 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఇదీ చదవండి:BOMBS: వెదురుకుప్పంలో నాటు బాంబుల కలకలం.. ముగ్గురు అరెస్ట్