ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మళ్లీ 20 వేలు దాటిన కేసులు - Andhra News

మళ్లీ 20 వేలు దాటిన కేసులు
మళ్లీ 20 వేలు దాటిన కేసులు

By

Published : May 12, 2021, 6:04 PM IST

Updated : May 12, 2021, 6:30 PM IST

17:59 May 12

కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,452 కరోనా కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 19,095 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,97,370 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 90,750 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా మృతులు..

కరోనాతో అత్యధికంగా విశాఖ జిల్లాలో 11 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున వైరస్​కు బలయ్యారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.

జిల్లాల వారీగా..

తూర్పుగోదావరి జిల్లాలో 2,927, విశాఖ జిల్లాలో 2,238, అనంతపురం జిల్లాలో 2,185, చిత్తూరు జిల్లాలో 1,908, గుంటూరు జిల్లాలో 1,836, కడప జిల్లాలో 1,746, నెల్లూరు జిల్లాలో 1,689, కర్నూలు జిల్లాలో 1,524, శ్రీకాకుళం జిల్లాలో 1,285, పశ్చిమగోదావరి జిల్లాలో 1,232, ప్రకాశంలో 1,192, కృష్ణాలో 997, విజయనగరంలో 693 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండీ... దేశంలోనే టాప్‌టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలి: సీఎం

Last Updated : May 12, 2021, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details