AP Corona Cases latest updates: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 38,479 శాంపిల్స్ కు నిర్ధరణ పరీక్షలు చేశారు. చిత్తూరులో 254,విశాఖలో 196, తూర్పుగోదావరిలో 93, కృష్ణా లో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103, ప్రకాశంలో 40, శ్రీకాకుళంలో 55, అనంతపూరంలో 138, కర్నూలులో 29, కడపలో 20, పశ్చిమగోదావరిలో 25, విజయనగరంలో 83 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు.
New Corona Cases in AP : రాష్ట్రంలో.. కొత్తగా 1,257 మందికి కరోనా.. ఇద్దరు మృతి - ఏపీలో కరోనా పరీక్షలు
AP Corona Cases : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా 1,257 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా కేసులు..కొత్తగా 1,257 మందికి వైరస్..ఇద్దరు మృతి
రాష్ట్రంలో 4,774 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 14,505 కు పెరిగింది. 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి : International Craft Award: నిమ్మలకుంట కళాకారుడికి.. ప్రతిష్ఠాత్మక అవార్డు