రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,956 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల కొత్తగా 60 మరణాలు సంభవించాయి. కొత్త కేసులతో కలిపి 5,75,079 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. కరోనాతో ఇప్పటివరకు 4,972 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 93,204 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,76,903 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 61,529 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 46,61,355 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,412 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1,091, నెల్లూరులో 756, చిత్తూరులో 748 కరోనా కేసులు, గుంటూరులో 666, శ్రీకాకుళంలో 517, విశాఖలో 490 కరోనా కేసులు వచ్చాయి. విజయనగరంలో 481, అనంతపురంలో 483, ప్రకాశంలో 444 కరోనా కేసులు, కర్నూలులో 341, కడపలో 326, కృష్ణాలో 201 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా మరణాలు
కరోనాతో గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 9, అనంతపురంలో 7, కర్నూలులో ఐదుగురు మృతి చెందారు. ప్రకాశంలో 5, విశాఖలో 5, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కరోనాతో విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. నెల్లూరులో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు కరోనా వల్ల మరణించారు.
ఇదీ చదవండి :రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న వాగులు