రాష్ట్రంలో కరోనా కేసుల్లో క్రమంగా తగ్గుదల నమోదు అవుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 7553 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా ఉభయ గోదావరి జిల్లాలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1166 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం తెలిపింది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 989 మందికి కరోనా సోకింది. అనంతపురం జిల్లాలో 309 మందికి, చిత్తూరులో 902 మందికి, గుంటూరులో 606 మందికి, కడపలో 589 మందికి, కృష్ణాజిల్లాలో 344 మందికి కరోనా సోకింది. కర్నూలు జిల్లాలో 272 మందికి, నెల్లూరులో 556 మందికి, ప్రకాశం జిల్లాలో 672 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 347, విశాఖపట్నంలో 410, అలాగే విజయనగరంలో 391 మందికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. ఈ కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల 39 వేల 302గా నమోదైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 555 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71,465 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
పెరుగుతున్న రికవరీ రేటు... కొత్తగా 7553 మందికి కొవిడ్ పాజిటివ్ - ఏపీ కరోనా వార్తలు
17:54 September 22
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 7,553 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అవుతున్నా తూర్పుగోదావరి జిల్లా మాత్రం కరోనా హాట్ స్పాట్ కేంద్రంగానే కొనసాగుతోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 51 మంది మృతి చెందినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలియచేసింది. రాష్ట్రంలో క్రమంగా రికవరీ రేటు పెరుగుండటంతో పాజిటివిటీ రేటు కూడా దిగివస్తోంది.
పాజిటివిటీ రేటు 12.22
ఇక రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 51 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ కారణంగా చిత్తూరులో 8, అనంతపురంలో 6గురు , విశాఖలో 6గురు, కృష్ణా జిల్లాలో 5గురు, ప్రకాశం జిల్లాలో 5గురు, తూర్పుగోదావరి జిల్లాలో 4గురు, కర్నూలులో నలుగురు, గుంటూరులో 3, కడపలో 3, నెల్లూరులో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళంలో ఒక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 5461కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో రికవరీల రేటు పెరిగిందని .. అలాగే పాజిటివిటీ రేటు కూడా క్రమంగా తగ్గుతోందని వైద్య,ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 12.22గా నమోదైంది.
ఇదీ చదవండి : సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు