Corona Updates: ఏపీలో కొత్తగా 1,378 కేసులు.. 10 మరణాలు
16:52 September 02
కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,566 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,378 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,16,680 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 13,877కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,139 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,88,101కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,67,45,035 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
TAGGED:
VJA_Corona bulletin_Breaking