రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 66,002 నమూనాలు పరీక్షించగా 1,221 మందికి కరోనా నిర్ధరణయ్యింది. మహమ్మారి వల్ల పది మంది మరణించారు. 1,829 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఈరోజు బయటపడిన వైరస్ బాధితులతో కలిపి.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,59,932కు చేరింది. ఇప్పటివరకు 8,37,630 మంది కోలుకోగా.. 15,382 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 6,920 మంది మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 1,221 కరోనా కేసులు..10 మంది మృతి - నవంబర్ 20న ఏపీలో కరోనా కేసులు
కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో క్రమేపీ తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,221 మందికి కొవిడ్ సోకగా.. 10 మంది మరణించారు. 1,829 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 15,382 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అనంతపురం జిల్లాలో అత్యధికంగా 202 మంది కొత్తగా కొవిడ్ బారిన పడగా.. కర్నూలులో అత్యల్పంగా 19 మందికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లాలో 198, చిత్తూరులో 175, పశ్చిమ గోదావరిలో 145, గుంటూరులో 144, విశాఖపట్టణంలో 69, కడపలో 65, ప్రకాశంలో 50, నెల్లూరులో 47, అనంతపురంలో 41, శ్రీకాకుళంలో 34, విజయనగరంలో 32 మందికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. చిత్తూరు, కృష్ణాల్లో ఇద్దరు.. తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారితో మరణించారని పేర్కొంది.
ఇదీ చదవండి:రాష్ట్రంలోని రాజ్యాంగ వైఫల్యాలపై రాష్ట్రపతికి లేఖ: ఎంపీ రఘురామ