రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ ఒక నిర్ణయానికి రాలేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, సీనియర్ నేత కనుమూరి బాపిరాజు తెలిపారు. పార్టీ నిర్ణయం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని విజయవాడలో స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం... తమ పార్టీ నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమన్నారు.
"కేబినెట్ నిర్ణయం తర్వాత రాజధానులపై స్పందిస్తాం" - three capitals for AP news
జీఎన్ రావు కమిటీ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తర్వాతే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. పార్టీ నిర్ణయం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని స్పష్టం చేశారు.
AP congress leaders comments on three capitals for AP