ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పథకాల అమలుపై బ్యాంకుల ప్రతినిధులతో సీఎంవో అధికారుల చర్చ - ap cmo officials discuss with bank representatives

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లకు సంబంధించిన అంశాలపై బ్యాంకుల ప్రతినిధులతో సీఎంవో కార్యాలయ అధికారులు చర్చించారు. ప్రత్యేకంగా మహిళలకు అందిస్తున్న పథకాలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ap-cmo-
ap-cmo-

By

Published : Aug 10, 2020, 9:50 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు బ్యాంకుల ప్రతినిధులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జాతీయ బ్యాంకుల ప్రతినిధులతో మాట్లాడిన సీఎంఓ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్... ప్రత్యేకించి మహిళలకు అందిస్తున్న పథకాలు, వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాలకు సంబంధించిన అంశాలపై బ్యాంకర్లతో మాట్లాడారు.

వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాలు మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాయని బ్యాంకర్లు అభిప్రాయపడినట్టు సీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. ఆర్థిక స్వావలంబన కల్పించటంలో తోడ్పాటు అందిస్తున్నాయని వివిధ బ్యాంకుల ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. మరోవైపు మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం అమూల్, హెచ్​యూఎల్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు సీఎంఓ కార్యాలయ అధికారులు బ్యాంకర్లకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details