ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుకు తోడుగా రైతు భరోసా కేంద్రాలు:సీఎం జగన్

రైతు వేసే విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు తోడుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయని సీఎం జగన్ అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నేరుగా రైతులకు సరఫరా చేసేలా కియోస్క్​లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వమే హామీ ఇస్తుందని చెప్పారు.

rythu bharosa centres
rythu bharosa centres

By

Published : May 30, 2020, 3:55 PM IST

ముఖ్యమంత్రి జగన్

రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు. రూ.2,495 కోట్లతో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను నేరుగా రైతులకు సరఫరా చేసేలా కియోస్క్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కియోస్క్‌ల ద్వారా రైతులు కావాల్సినవి కొనుగోలు చేయవచ్చని సీఎం వివరించారు. రాబోయే రోజుల్లో నేరుగా గ్రామాల్లోనే భూసార పరీక్షలు చేస్తామన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వమే హామీ ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు రూ.2200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గతంలో పోలీసులతో చాకిరి చేయించారన్న సీఎం జగన్‌.. ఇప్పుడు పోలీసులకు వారాతంపు సెలవు అమలు చేస్తున్నామని తెలిపారు.

మద్యంపానం తగ్గింది

గుడి, బడి తేడా లేకుండా గతంలో 43 వేల బెల్టు మద్యం దుకాణాలు ఉండేవన్న ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోందని చెప్పారు. ధరలు పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో మద్యపానం తగ్గిందన్నారు. గతంలో వారం రోజులు మద్యం తాగితే..ప్రస్తుతం రెండు రోజులే తాగుతున్నారని వివరించారు.

'ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి ఆదా చేశాం. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయింది. గతంలో ఎవరూ ఈ అవినీతి గురించి పట్టించుకోలేదు. గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలను సేకరించాం. 29 లక్షల ఇళ్ల పట్టాలకు శ్రీకారం చుడుతున్నాం'- ముఖ్యమంత్రి జగన్‌

ఇదీ చదవండి:

డా.సుధాకర్ అరెస్టుపై సీబీఐ దర్యాప్తు.. అధికారులపై కేసులు

ABOUT THE AUTHOR

...view details