ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధికారులూ.. కడప జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టండి: సీఎం జగన్ - కడప జిల్లా అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

కడప, పాడా(పులివెందులు ఏరియా డెవలప్​మెంట్ అథారిటీ)లో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమావేశమయ్యారు. శాఖల వారీగా పనులు, విద్య, వైద్య సంస్థలు, నీటి పారుదలశాఖ పనులపై చర్చించారు.

ap-cm-jagan-review-on-kadapa-district-development
కడప జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం జగన్

By

Published : Feb 13, 2020, 7:54 PM IST

కడప జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం జగన్

కడప జిల్లా పులివెందులలో మెడికల్‌ కళాశాల పనులు, క్యాన్సర్‌ ఆస్పత్రి, ఇతర అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్షించారు. పనుల ప్రగతి, నిధుల ఖర్చు అంశాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్‌స్టోరేజీల మ్యాపింగ్‌ చేయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపై మ్యాపింగ్‌ చేయించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలన్నీ ఒకే తరహా నమూనాలో ఉండాలన్నారు. ఈసారి వరద నీరు వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి ప్రాజెక్టులు తప్పనిసరిగా నిండాలని.. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

సీఎం ఆదేశాలివే

ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఖర్జూరం సాగుపై అధ్యయనం చేయించాలన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తిని బాగా ప్రోత్సహించాలన్న సీఎం.. వెటర్నరీ, హార్టికల్చర్‌ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచనలు చేయాలన్నారు. వారం రోజుల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పులివెందులలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని చెప్పారు.

ఇవీ చదవండి:

కార్యాలయాలు వేరే జిల్లాకు మార్చడమెందుకు?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details