ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ల్యాబ్‌లు లేని జిల్లాల్లో ఏర్పాటుకు సీఎం జగన్​ ఆదేశం - ఏపీలో కరోనా కేసుల వార్తలు

కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చుకోవడం అవసరమన్న సీఎం... గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలకపాత్ర పోషిస్తాయన్నారు.‌ అనుమతి ఇచ్చిన పరిశ్రమలు, వ్యవసాయ పనులు కొనసాగించాలన్నారు.

cm review on corona
cm review on corona

By

Published : Apr 25, 2020, 4:05 PM IST

కరోనా నివారణ, సహాయ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా లాంటి విపత్తుల వల్ల మరింత అప్రమత్తం కావాలని సీఎం అధికారులకు సూచించారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చుకోవడం అవసరమన్న సీఎం... గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలకపాత్ర పోషిస్తాయన్నారు.‌ ల్యాబ్‌లు లేని జిల్లాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో మంచి అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.

కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలన్న సీఎం... టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని ఆదేశించారు. అనుమతి ఇచ్చిన పరిశ్రమలు, వ్యవసాయ పనులు కొనసాగించాలన్నారు.

ఇవీ చదవండి:కశ్మీర్​లో మరో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABOUT THE AUTHOR

...view details