ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్రలను నియమించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలకు గ్రేడింగ్ ఇవ్వాలని అన్నారు. ఈ ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
'ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో 6 ప్రమాణాలు కచ్చితంగా అమలు కావాలి. వైద్యులు, ఔషధాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, పారిశుద్ధ్యం బాగుండాలి. అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లోనూ ఇవే ప్రమాణాలు పాటించాలి.'- ముఖ్యమంత్రి, జగన్
ఆరోగ్యమిత్రలు రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.104 కాల్‌సెంటర్ మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందాలన్న ఆయన...వారికి వైద్యులు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని సూచించారు.