రాష్ట్రంలో కరోనా నివారణ కోసం... ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయి కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10కి పెంచాలని అధికారులను నిర్దేశించారు. వైద్యులపై పనిభారం పడకుండా నాణ్యమైన సేవలందించాలని నిర్ణయించారు. జిల్లాల్లోని 84 కొవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ రాయితీలు అందించనుంది. ఆయా ఆసుత్రుల్లో ఏం చేయాలన్న దానిపై 2 రోజుల్లో నివేదిక తయారు చేయాలని చెప్పారు.
వైద్య సిబ్బందిని నియమించండి
5 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లోనూ... నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని చెప్పారు. కోవిడ్ సోకిందన్న అనుమానం వస్తే ఏంచేయాలి..? ఎవరిని కలవాలన్న దానిపై అవగాహనకు భారీగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, వయసులో పెద్దవాళ్లకు వైద్య సాయంలో ఆలస్యం వద్దని స్పష్టం చేశారు.
వైద్యరంగంలో నాడు - నేడుపై దృష్టి