పాఠశాలల్లో జూన్ నాటి కల్లా పూర్త కావాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. బడుల్లో సామగ్రి, చాక్ బోర్డ్స్ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన ఒకటి రెండు అంశాలకు సంబంధించి కూడా త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 72వేల 596 గ్రీన్ చాక్‌బోర్డుల కోసం రివర్స్ టెండర్లలో 5 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని సీఎంకు తెలిపారు. స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫారం దుస్తులు, బ్యాగు నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యార్థులకు ఇచ్చే ఈ రెండు నాణ్యంగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
పాఠశాలల్లో 'నాడు-నేడు' కార్యక్రమంపై సీఎం సమీక్ష - పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం
జూన్ నాటికి పాఠశాలల్లో పూర్తి కావల్సిన పనులపై ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బడుల్లో సామగ్రి, చాక్ బోర్డ్స్ తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫారం దుస్తులు, బ్యాగు నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ap-cm-jagan-review