జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంపై హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీబీఐ ఛార్జిషీట్లను తేల్చిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. సీబీఐ అభియోగ పత్రాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గతంలో 2జీ కుంభకోణం కేసులో సీబీఐ కేసు వీగిపోయాక.. ఈడీ కేసుపై న్యాయస్థానం విచారణే జరపలేదని వాదించారు. ఈ కేసులపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.
'సీబీఐ కేసులను ముందు విచారించండి' - జగన్పై ఈడీ కేసులు వార్తలు
జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంపై సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఛార్జిషీట్లను తేల్చిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని కోరారు. మద్యం సిండికేట్ కేసులో అనిశా న్యాయస్థానం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
cm jagan
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తదితరులు నిందితులుగా ఉన్న మద్యం సిండికేట్ కేసులో ఏసీబీ న్యాయస్థానంలో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగింది. తదుపరి విచారణ ఏసీబీ కోర్టు నవంబరు 2కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి :ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్