ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్ - raithu barosa latest news

వైఎస్సార్‌ రెండో విడత రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లోకి రూ.1,114 కోట్ల నగదును బదిలీ చేశారు.

cm jagan
cm jagan

By

Published : Oct 27, 2020, 1:14 PM IST

Updated : Oct 27, 2020, 2:10 PM IST

వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత నిధులను మంగళవారం ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్లు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. 50లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే సంతోషంగా ఉందన్నారు. 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సహాయం అందుతోందన్నారు. నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.135 కోట్ల పెట్టుబడి రాయితీ కల్పించనున్నట్లు సీఎం తెలిపారు.

'రైతు భరోసా రెండో విడతలో రైతులకు రూ.2వేలు చొప్పున ఇస్తున్నాం. అక్టోబరు 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించిన గిరిజనులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ రూ.11,500 చొప్పున జమ చేస్తున్నాం. జూన్‌ నుంచి ఆగస్టు వరకు నష్టపోయిన రైతులకు ఇవాళే సాయం అందిస్తున్నాం. జూన్ నుంచి ఆగస్టు వరకు నష్టపోయిన రైతులకు ఇవాళే సాయం అందిస్తామని...సెప్టెంబర్, అక్టోబర్‌లో పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోపే పరిహారం చెల్లిస్తాం. రైతుకు అండగా ఉండేందుకు 10 వేల 641 గ్రామాల్లో ఆర్బీకేలు ఏర్పాటు చేస్తున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.8వేల 655 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాం' అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

'పంట నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రకృతి విపత్తుల ద్వారా పంట నష్టపోయిన 1.66 లక్షల రైతులకు రూ.135.73 కోట్లు సాయం అందిస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రతి అర్హుడికీ సాయం అందిస్తున్నాం. పాత అప్పులకు జమ చేసుకోని విధంగా ఈ సాయం అందిస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది' అని సీఎం వివరించారు.


ఇదీ చదవండి:

నెల రోజులపాటు పాఠశాలలు ఒక పూటే: మంత్రి సురేష్

Last Updated : Oct 27, 2020, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details