దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్.. టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించారు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలను టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పరిధిలోకి తీసుకొచ్చింది. టెంపుల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలో ఆలయాలు, పలు సేవల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు ఈ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఈ–హుండీకి కానుకలు సమర్పించవచ్చు.
దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం - cm jagan inagurated temple managment system

temple managment system
16:40 March 15
టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
తొలిసారిగా అన్నవరం ఆలయంలో ఈ ఆన్‌లైన్ పేమెంట్ వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు. నెలాఖరు నాటికి 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆలయాల్లో అవినీతి కట్టడికి ఈ వ్యవస్థ ఉపయుక్తమవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శక వ్యవస్థలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి
Last Updated : Mar 15, 2021, 6:56 PM IST