మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ అభ్యర్థులను ఖరారు చేసే దిశగా సీఎం కసరత్తు చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో మేయర్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంపై రేపు మంత్రులు, పార్టీ నాయకులతో ముఖ్య నేతలు చర్చించనున్నారు. అనంతరం సీఎంతో చర్చించి తుది జాబితా రూపొందించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఈనెల 18న ప్రకటించే అవకాశం ఉంది.
మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం సుదీర్ఘ కసరత్తు.. 18న ప్రకటన! - మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వార్తలు
cm jagan
17:18 March 15
మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో ముగిసిన సీఎం భేటీ
పరిశీలనలో అభ్యర్థులు:
- గుంటూరు మేయర్ అభ్యర్థిగా మనోహర్ నాయుడు
- కర్నూల్ మేయర్ అభ్యర్థిగా రామయ్య (బీసీ)
- కడప మేయర్ అభ్యర్థిగా సురేశ్ బాబు (బీసీ)
- ఒంగోలు మేయర్ అభ్యర్థిగా సుజాత (ఎస్సీ)
- తిరుపతి మేయర్ అభ్యర్థిగా డా. శిరీష(బీసీ)
- విజయవాడ మేయర్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి(బీసీ)
- విశాఖ మేయర్ అభ్యర్థిగా శ్రీనివాస్, శ్రీధర్, ఉషశ్రీ
- విజయనగరం మేయర్ అభ్యర్థిగా ఎడ్ల కృష్ణవేణి
ఇదీ చదవండి
Last Updated : Mar 15, 2021, 8:45 PM IST