CM Jagan Delhi Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్సి జవహర్‌రెడ్డి కూడా సీఎం వెంట దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీని.. 6 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను.. అలాగే రాత్రి 9.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవనున్నారు.
CM delhi tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ - ap cm jagan to meet pm modi
CM delhi tour: ప్రత్యేక విమానంలో సీఎం జగన్ దిల్లీ బయల్దేరారు. సాయంత్రం ప్రధానితో భేటీ కానున్నారు. అమిత్ షాతో సీఎం భేటీకీ సీఎంవో అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిపింది.

నూతన జిల్లాల ఏర్పాటు వివరాలను మోదీ, అమిత్‌షాకు జగన్ వివరిస్తారని సమాచారం. భారీగా అప్పులు చేస్తున్న రాష్ట్రాలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటాయని ఇటీవల ప్రధానికి ఉన్నతాధికారులు నివేదించారనే సమాచారంతో... ఈ అంశం కూడా మోదీతో జగన్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి... రేపు ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ABV Rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీకి సర్కార్ షోకాజ్ నోటీసు