ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదనంగా మరో రూ.5వేల కోట్ల రుణానికి హామీ..!

ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్​కు రుణ సేకరణ పరిమితిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అదనంగా మరొక 5 వేల కోట్ల రూపాయల రుణానికి హామీ ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap-civil-supplies-corporation-credit-limit-enhanced
ap-civil-supplies-corporation-credit-limit-enhanced

By

Published : Jan 5, 2021, 5:01 PM IST

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్​కు రుణ సేకరణ పరిమితిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అదనంగా మరొక 5 వేల కోట్ల రూపాయల రుణానికి హామీ ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేసేందుకు ఈ మొత్తాన్ని రుణంగా సేకరించాలని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్​ను ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదిలోగా ప్రభుత్వ హామీని వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే 25 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనుమతించింది. దీనికి అదనంగా ఈ ఐదు వేల కోట్ల రుణ పరిమితిని పెంచడంతో మొత్తం కార్పొరేషన్ రుణ పరిధి 32 వేల కోట్లకు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details