ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని అసైన్డ్‌ భూముల కేసు విచారణ వేగవంతం - అమరావతి భూముల కేసు

రాజధాని అసైన్డ్‌ భూముల కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. మందడం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి పలు దస్త్రాలు పరిశీలించారు.

amaravati lands scam case
amaravati lands scam case

By

Published : Mar 28, 2021, 4:19 AM IST

అమరావతిలోని అసైన్డ్‌ భూముల కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఈ నెల 15, 25 న రైతులను పోలీస్ స్టేషన్ లకు పిలిచి విచారించిన సీఐడీ అధికారులు .. శనివారం నేరుగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాలు సేకరించారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఎస్సీ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏయే ప్రాంతాల్లో భూమలుు ఉన్నాయి.. ఎవరెవరికి విక్రయించారన్న దానిపై ఆరా తీశారు. మధ్యవర్తుల ద్వారా భూములు అమ్మారా లేక.. ఎవరైనా బలవంతంగా లాక్కున్నారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం మందడం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి పలు దస్త్రాలు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details