ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ సీఐడీకి జాతీయస్థాయి పురస్కారం - స్కోచ్

ఏపీ సీఐడీకి జాతీయస్థాయి పురస్కారం దక్కింది. సైబర్ నేరాలను ఆరికట్టేందుకు ఏర్పాటు చేసిన 4s4c వెబ్ పోర్టల్ కు జాతీయ అవార్డు లభించిందని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ వెల్లడించారు.

ap cid
ap cid

By

Published : Aug 24, 2020, 4:59 PM IST

సైబర్ నేరాలను ఆరికట్టేందుకు ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన 4s4c వెబ్ పోర్టల్​కు జాతీయస్థాయిలో అవార్డు లభించిందని సీఐడి ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. వరుసగా మూడోసారి జాతీయ పురస్కారం(స్కోచ్) లభించటం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.ఫేస్​బుక్, వాట్సప్​ల్లో మహిళలను వేధిస్తున్న పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. యూ ట్యూబ్ ఛానల్​లో సైబర్ నేరాలపై నిపుణుల చేత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు .

ABOUT THE AUTHOR

...view details