ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక సమావేశం - AP BUDJET news

ఈ నెల 16 వ తేదీన ఉదయం 9 గంటలకు మంత్రివర్గం ప్రత్యేక సమావేశం కానుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.

ap cabinet
ap cabinet

By

Published : Jun 13, 2020, 12:55 AM IST

2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు మంత్రి వర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

శాసన సభ ప్రారంభానికి ముందు సచివాలయంలోని మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details