- వెయ్యి కోట్ల రూపాయలతో భూముల రీసర్వే
'వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్షణ' పేరుతో సమగ్ర రీ-సర్వే చేపట్టాలని కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని భూముల్లో రీ-సర్వే చేయనున్నట్టు మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదించినట్టు తెలిపారు. వచ్చే జనవరి నుంచి 2023 జూన్ నాటికి దశలవారీగా రీ-సర్వే పూర్తి చేస్తామన్నారు.
- చిరు వ్యాపారులకు తోడుగా
చిరు వ్యాపారులకు పెట్టుబడి కింద సాయం చేసే ‘జగనన్న తోడు’ పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పుట్‌పాత్‌పై చిన్నచిన్న వస్తువులు అమ్ముకునేవాళ్లు, తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మకునేవారు, రోడ్లపక్కన తినుబండారాలు అమ్ముకునే చిరు వ్యాపారులు, కలంకారీ పనులు, ఏటికొప్పాక బొమ్మలు, మట్టిపాత్రలు, తోలుతో బొమ్మలు చేసేవాళ్లు, బొబ్బిలి వీణల తయారీదారులు వంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్నవారికి అవసరమైన పెట్టుబడిగా రూ.10 వేల వరకు వడ్డీలేని రుణాలను ఈ పథకం కింద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 24న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
- ఇకనుంచి ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక..
నూతన ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుకను ఇకనుంచి ఆఫ్‌లైన్‌లోనూ.. సొంత వాహనాల్లోనూ తెచ్చుకోవచ్చని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎస్‌ఈబీని బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. ఎస్‌ఈబీకి అదనపు పోస్టులు కేటాయించామన్న మంత్రి.. డ్రగ్స్, గుట్కా, ఇతర మత్తుపదార్థాలను ఎస్‌ఈబీ పరిధిలోకి తెచ్చామన్నారు. ఎస్‌ఈబీకి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.
- జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం
జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. బియ్యం సంచులు పక్కదారి పట్టకుండా క్యూఆర్ కోడ్ వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. పాడిపరిశ్రమను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
- మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ.5,700 కోట్లు
మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై కేబినెట్‌లో చర్చించారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. రూ.5,700 కోట్లతో పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో తేదీలు ఖరారు కాలేదు. ఈ నెలలోనే శాసనసభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
- ఈ నెల 24 న జగనన్న తోడు పథకం ప్రారంభం
'జగనన్న తోడు' ద్వారా చిరువ్యాపారులకు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. 'జగనన్న తోడు' కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 24న జగనన్న తోడు పథకం ప్రారంభంకానుందని వెల్లడించారు. ఈ పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు అందచేస్తున్నామని తెలిపారు.
- పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు..
500 లీటర్ల కంటే ఎక్కువగా పాల సేకరణకు అవకాశం ఉన్న సుమారు 9 వేలకు పైగా గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్బీకే వద్దే పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు కెబినెట్ ఆదేశించింది. పశువుల దాణాను ఆర్బీకే కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు నిర్ణయించింది.
- ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కు కెబినెట్ ఆమోదం