ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న కేబినెట్​ సమావేశం.. భారీగా పోలీసుల బందోబస్తు - cabienet decisons news

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్​ సమావేశం నేపథ్యంలో సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మందడం శిబిరం వద్ద వందలమంది పోలీసుల మోహరించారు. రహదారి పక్కనున్న కొన్ని ఇళ్ల ముందు వలలు ఏర్పాటు చేశారు.

ap cabinet meeting
ap cabinet meeting

By

Published : Feb 12, 2020, 10:15 AM IST

Updated : Feb 12, 2020, 11:29 AM IST

పలు ప్రతిపాదనలపై చర్చించనున్న మంత్రివర్గం

  1. జగనన్న విద్యా కానుక కింద పుస్తకాల సంచులు ఇవ్వాలని ప్రతిపాదన
  2. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల సంచులు ఇవ్వాలని ప్రతిపాదన
  3. 3 జతల దుస్తులు, 2 జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వాలని ప్రతిపాదన
  4. ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదన
  5. సీపీఎస్ ర్యాలీల్లో నమోదైన కేసులను రద్దు చేయాలని ప్రతిపాదన
  6. స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన
  7. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 20 రోజులకు కుదించే అంశంపై మంత్రివర్గంలో చర్చ
  8. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లుపై మంత్రివర్గంలో చర్చ
  9. 10 వేల మె.వా. సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు
Last Updated : Feb 12, 2020, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details