ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - latest cabinet meeting

ఈనెల 12న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అభివృద్ధికి సంబంధించిన కీలకాంశాలపై చర్చించనుంది. దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అమరావతి ప్రాంతంలో కోర్ క్యాపిటల్‌కు సంబంధించి, రాజధాని ప్రాంత రైతులకు ప్రయోజనాలు కల్పించే మరికొన్ని అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 13న కేబినెట్ భేటీ నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీచేశారు. గంట వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను సవరించారు. కేబినెట్ భేటీని ముందుకు జరిపి 12నే నిర్వహించనున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.

ap cabinet meeting
ఈనెల 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

By

Published : Feb 8, 2020, 6:41 AM IST

ఈనెల 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details