జనవరి నుంచి అమల్లోకి రానున్న"జగనన్న అమ్మఒడి"పథకం అమలుకు...ఈ ఆర్థిక సంవత్సరంలో6వేల455కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అర్హులైనవారు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉన్నా...అమ్మఒడి వర్తిస్తుందని మంత్రి పేర్ని వెల్లడించారు.
కృష్ణా,గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రైతుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు ప్రతి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ అగ్రి ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.