ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కీలకమైన అంశాలతో పాటు దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థికసాయం అందించే అంశంపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి కొన్ని నిర్ణయాలను ఈ భేటీలో తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే అమరావతి ప్రాంతంలో కోర్ క్యాపిటల్‌కి సంబంధించిన అంశాలు, రాజధాని ప్రాంత రైతులకు ప్రయోజనాలు కల్పించే మరికొన్ని అంశాలపైనా కేబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
13న కాదు.. 12న