మంత్రి వర్గ భేటీలోని కీలక నిర్ణయలివే..!
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై మంత్రివర్గ భేటీలో చర్చించారు.
ap-cabinet-meeting-started
మంత్రివర్గ భేటీలోని అంశాలు
- చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయంపై సమావేశంలో చర్చ
- ఏటా రూ.24 వేలు 'వైఎస్‌ఆర్ చేనేత నేస్తం' పేరుతో అమలుకు ఆమోదం
- ఏటా డిసెంబర్ 21న ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం
- చేనేత నేస్తం పథకానికి రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
- ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం
- ఒకే విడత రూ.24 వేలు సాయం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం
- చేనేత నేస్తం పథకం ద్వారా 90 వేల కుటుంబాలకు లబ్ది
- మత్స్యకార కుటుంబాలకు ఆర్థికసాయానికి కేబినెట్ ఆమోదం
- వేటనిషేధ సమయంలో ఇచ్చే సాయం రూ.10 వేలకు పెంచాలని నిర్ణయం
- హోంగార్డుల జీతాల పెంపును ఆమోదించిన మంత్రివర్గం
Last Updated : Oct 16, 2019, 4:05 PM IST