ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రివర్గ సమావేశం వాయిదా.. 8న నిర్వహించే అవకాశం - రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా వార్తలు

రాష్ట్ర సచివాలయంలో అక్టోబరు 1న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ప్రభుత్వ శాఖలకు చెందిన కొన్ని కీలకమైన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం కాని కారణంగానే.. ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 8న కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ap cabinet meeting
ఏపీ మంత్రివర్గ సమావేశం

By

Published : Sep 30, 2020, 5:25 PM IST

రాష్ట్ర సచివాలయంలో అక్టోబరు 1 న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ప్రభుత్వ శాఖలకు చెందిన కొన్ని కీలకమైన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం కానట్టు తెలుస్తోంది. అక్టోబరు రెండో వారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా సిద్ధం కాకపోవటం, అవి ఇంకా న్యాయసమీక్షలో ఉండటంతో కేబినెట్ వాయిదా పడినట్టు సమాచారం.

అలాగే... ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాల్లో ఉండటం సైతం.. ఈ నిర్ణయానికి కారణమైనట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలు సిద్ధం అయ్యాక రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని అక్టోబరు 8 న నిర్వహించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details