ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు కేబినెట్ భేటీ... నిపుణల కమిటీ నివేదికపైనే ప్రధాన చర్చ..! - జీఎన్ రావు కమిటీ నివేదిక వార్తలు

రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధితో పాటు రాజధానుల ప్రతిపాదనలపై జీఎన్​ రావు కమిటీ ఇచ్చిన నివేదిక గురించి ప్రధానంగా చర్చించనుంది.

ap cabinet meet on tomarrow
ap cabinet meet on tomarrow

By

Published : Dec 26, 2019, 4:41 PM IST


రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో కేబినెట్‌ భేటీ నేపథ్యంలో... రైతుల నుంచి నిరసనలు రావచ్చన్న నిఘావర్గాల సమాచారంతో... అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. కేబినెట్ భేటీ సచివాలయంలోనా... లేదా క్యాంప్‌ ఆఫీసులో నిర్వహించాలా అనేదానిపై చర్చ జరుగుతోంది.

మూడు రాజధానులపై మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను కెబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, పంటలకు మద్దతు ధర తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సీఆర్డీఏలో ఐఏఎస్​లు కొన్న ప్లాట్లకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపైనా కేబినెట్ చర్చించనుంది.

ఇదీ చదవండి : 'ఆరోపణలు అవాస్తవం... ఒక్క ప్లాట్​ మాత్రమే ఉంది'

ABOUT THE AUTHOR

...view details