రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెుత్తం 22 అంశాలపై కీలకంగా చర్చించారు. 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుకు కేబినెట్ తీర్మానించింది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ - ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం న్యూస్
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
ap cabinet meet and decision on new districts
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి ఆమోదం
- 6 కోట్లకు పైగా అంచనాలతో వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేయాలని నిర్ణయం
- 44,500 పాఠశాలల్లో నాడు నేడు పథకాన్ని మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయం
- రాయలసీమ కరవు నివారణ కోసం ప్రతేకంగా రూ.40వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానం
- సీపీఎస్ రద్దు కోసం టీచర్లు చేసిన ఆందోళనపై గతంలో పెట్టిన కేసులు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం
- గుంటూరు1 పోలీసు స్టేషన్‌పై దాడి చేశారని ముస్లిం యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నిర్ణయం