ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ పాలనా రాజధాని - శాసన రాజధానిగా అమరావతి - ap cabinate meeting latest news

ministers meeting
ministers meeting

By

Published : Jan 20, 2020, 9:02 AM IST

Updated : Jan 20, 2020, 8:08 PM IST

06:58 January 20

నాలుగు బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

ఊహించిందే నిజమైంది. అమరావతి రైతుల ఆక్రందన.... అరణ్య రోదనగానే మిగిలింది. రైతుల ధర్నాలు, మహిళల కన్నీళ్ల మధ్యే మూడు మూడు రాజధానులకు..ఆమోదముద్ర పడింది. విశాఖ నుంచే పాలన సాగించాలని మంత్రివర్గం నిర్ణయించిన వేళ ఇక అమరావతి శాసన కార్యకలాపాలకే పరిమితంకానుంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి స్థానంలో ఏఎంఆర్డీఏను..తెరపైకి తెచ్చింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు మరో ఐదేళ్ల పొడగించాలని నిర్ణయింన మంత్రివర్గం.., రైతు కూలీలకు పరిహారం పెంచుతామని తెలిపింది.

అంతకుముందు..పాలన వికేంద్రీకరణకు సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం యథాతథంగా ఆమోదించింది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే కమిటీ  ఇచ్చిన నివేదికకు జై కొట్టింది. 3 రాజధానుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఏపీ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి బిల్లు 2020, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ-సీఆర్డీఏ చట్ట ఉపసంహరణ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఆ స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్​మెంట్​ అథారిటీ (ఏఎంఆర్డీఏ)కి ఆమోదం తెలిపింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు మరో ఐదేళ్లు పొడిగించాలని.. రైతు కూలీలకు పరిహారం పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.

రాజధాని రైతుల అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ కమిటీ నివేదికను యథాతథంగా అమోదించింది. మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ ఇచ్చిన ఈ నివేదికను ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయాన్ని విశాఖకు తరలించే అంశంపై ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఉదయం 9గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించింది. మంత్రులు, విశాఖ, అమరావతిలో రెండుచోట్లా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

సీఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించేందుకు సంబంధించిన బిల్లుకు.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్​మెంట్​ అథారిటీని (ఏఎంఆర్డీఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైపవర్ కమిటీ  సిఫార్సుల మేరకు..... అమరావతి రైతులను ఆకట్టుకునేందుకు వారికి ఇచ్చే కౌలును.. పదేళ్ల నుంచి పదిహేనేళ్లకు పెంచుతున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. అమరావతి ప్రాంతంలోని రైతు కూలీలకు ఇచ్చే పరిహారాన్ని 2వేల500 నుంచి 5వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ఇన్​సైడర్  ట్రేడింగ్ వ్యవహారాన్ని లోకాయుక్తకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇక..రాష్ట్రాన్ని 4  పరిపాలన జోన్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత సూపర్ కలెక్టరేట్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల అర్బన్ డెవలప్​మెంట్​ అథారిటీని ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయితీలు, సచివాలయాలకు అనుసంధానంగా ... రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య... రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. 

మంత్రివర్గం నిర్ణయాలు

  • హైపవర్‌ కమిటీ నివేదిక ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం
  • నాలుగు బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
  • పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
  • విశాఖ పాలనా రాజధాని, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం
  • అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
  • విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు
  • హైకోర్టు కర్నూలు తరలింపునకు మంత్రివర్గం ఆమోదం
  • రాష్ట్రాన్ని 4  పరిపాలన జోన్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయం
  • జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టరేట్‌ వ్యవస్థ ఏర్పాటు
  • మంత్రులు రెండుచోట్ల అందుబాటులో ఉండాలని నిర్ణయం
  • రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
  • రాజధాని రైతు కూలీలకు పరిహారం పెంపునకు మంత్రివర్గం ఆమోదం
  • రైతు కూలీలకు ఇచ్చే పరిహారం రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు
  • భూములిచ్చిన రైతులకు ప్రభుత్వమిచ్చే కౌలు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు
  • సీఆర్‌డీఏ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
  • ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
  • రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
  • రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రూ.199 కోట్లు కేటాయింపునకు ఆమోదం
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయం
  • పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
Last Updated : Jan 20, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details