జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్నింటా సముచిత స్థానం కల్పించారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించారన్నారు. రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకీ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ తర్వాత కొత్త మంత్రులు ఏమన్నారంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర మంత్రివర్గాన్ని ఇవాళ విస్తరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజుల చేత మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తమకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు నూతన మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త మంత్రులు ఏమన్నారంటే?
వెనుకబడిన జిల్లా శ్రీకాకుళానికి సీఎం పెద్దపీట వేశారని నూతన మంత్రి అప్పలరాజు అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తానన్నారు. నిజాయితీగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు.
బలహీన వర్గాలకు జగన్ అత్యంత ప్రాధాన్యమిచ్చారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల శకం ప్రారంభమైందని... తూర్పుగోదావరి జిల్లా సహా రాష్ట్రాభివృద్ది కోసం పని చేస్తానని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి-మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాల్
అప్పుడు పదో తరగతిలో స్టేట్ ర్యాంకర్... ఇప్పుడు మంత్రి
బాక్సింగ్ సంఘ అధ్యక్షుడిని వరించిన మంత్రి పదవి
Last Updated : Jul 22, 2020, 3:45 PM IST