భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కమలనాథులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయి చేసిన వ్యాఖ్యలు సరికావని అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా రాష్ట్ర విభాగం ట్వీట్ చేసింది. హద్దు దాటి మాట్లాడొద్దంటూ హెచ్చరించింది. పాపం పండే రోజులు వచ్చాయంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది.
విజయసాయి వ్యాఖ్యలకు భాజపా స్ట్రాంగ్ కౌంటర్ - mp vijayasai reedy latest news
వైకాపా ఎంపీ విజయసాయి చేసిన విమర్శలపై.. భాజపా రాష్ట్ర శాఖ తీవ్రంగా స్పందించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. హద్దులు దాటొద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.
ap bjp