సీఎం జగన్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. పేద, బలహీన వర్గాలకు శాపంగా మారిన జీవో నెంబరు 77ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రయివేటు కళాశాలాల్లో చదివే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరకని విద్యార్థులే ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటారని లేఖలో ప్రస్తావించారు.
పేద విద్యార్థులకు భారంగా మారనున్న ఈ జోవోను తక్షమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భాజపా తరపున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ ఈ రెండు పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. విదేశాల్లో చదవుకుంటున్న విద్యార్థులకు కూడా విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.