రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే.. విద్యా సంస్థలు దశలవారీగా ప్రారంభించాలని భాజపా డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకేసారి కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు పునఃప్రారంభించడం వల్ల కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అమెరికాలోనూ ఒకేసారి విద్యాసంస్థలు ప్రారంభించడం వల్ల 80 వేల మంది వైరస్ బారిన పడ్డారని సోము వీర్రాజు తెలిపారు. అందువల్ల పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే.. ప్రభుత్వం విద్యాసంస్థలు ప్రారంభించాలని సూచించారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు