ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో ఏపీభవన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మృతి - ap bhavan delhi latest news

ఏపీ భవన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ కొత్తపల్లి లింగరాజు(58) కరోనాతో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన ఆయన.. 1998 నుంచి ఏపీ భవన్‌లో వివిధ హోదాల్లో సేవలందించారు.

ap bhavan delhi
ఏపీభవన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మృతి

By

Published : May 1, 2021, 8:16 AM IST

దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ కొత్తపల్లి లింగరాజు(58) మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ సోకినట్లు తేలింది. వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన లింగరాజు 1998 నుంచి ఏపీ భవన్‌లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఏపీ, తెలంగాణ భవన్‌లకు చెందిన 25 మందికిపైగా కరోనాతో బాధపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details