తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు , నాగమణిల హత్యను ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులను అత్యంత కిరాతకంగా చంపిన నేరగాళ్లను అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీ , రామగుండం పోలీసు కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది. అసాంఘిక శక్తులు ఇటీవల న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్నారని.. వాటి నియంత్రించాలని తెలిపింది. లేదంటే న్యాయవాదులు సక్రమంగా విధులు నిర్వహించలేరని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ కారణంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. మరోవైపు న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ.. ఏపీ రాష్ట్ర లీగల్ కమిటీ , హైకోర్టు న్యాయవాదులు సంయుక్తంగా హైకోర్టు వద్ద నిరసన తెలిపారు.
లాయర్ దంపతుల హత్యను ఖండించిన ఏపీ బార్ కౌన్సిల్ - ఏపీ బార్ కౌన్సిల్ తాజా సమాచారం
తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య ఘటనను ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. అలాగే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది . మృతుల కుటుంబ సభ్యులకు కౌన్సిల్ సంతాపం ప్రకటించింది.
లాయర్ దంపతుల హత్యను ఖండించిన ఏపీ బార్ కౌన్సిల్