న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు అన్నారు. రాజ్యాంగ విధుల్లో భాగంగా తీర్పులిస్తున్న న్యాయవాదులను అసభ్యపదజాలంతో దూషించటం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తీర్పులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మూడు విభాగాలుగా రాజ్యాంగపరమైన బాధ్యతలు అప్పగించందన్నారు. శాసన వ్యవస్థ చట్టాలు చేస్తే ఆ చట్టాలను కార్యనిర్వహక వ్యవస్థ అమలు చేస్తోందనన్నారు. చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోయినా, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినా...చట్టబద్ధత లేకపోయినా వాటిని సవరించటం , కొట్టేయడం న్యాయస్థానాల బాధ్యత అని గుర్తు చేశారు.
న్యాయమూర్తుల చర్చ !