ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్, సభ్యులు - cji nv ramana

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో ఆయన్ను కలిసిన సభ్యులు.. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య, ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల అకాడమీ ఏర్పాటు తదితర అంశాలకు సహకరించాలని కోరినట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు.

ap bar council meet cji
సీజేఐని కలిసిన ఏపీ బార్ కౌన్సిల్

By

Published : Jun 16, 2021, 8:02 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, సభ్యులు హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐ అయిన తర్వాత మొదటి సారిగా తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సందర్భంగా రాజ్ భవన్​లో జస్టిస్ ఎన్వీ రమణను కలిసి సన్మానించినట్లు.. ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరామన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల అకాడమీ ఏర్పాటు చేయటానికి సహకరించాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణను విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, ఆలిండియా బార్ కౌన్సిల్ సభ్యులు రామిరెడ్డిలతో పాటు మొత్తం మరో 10 మంది సీజేఐను కలిశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details