రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయమై శాసనసభ వ్యవహారాల సలహా మండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 11 చట్టాల్లో సవరణలు, రెండు మూడు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
30 నుంచి అసెంబ్లీ సమావేశాలు! - ఏపీ అసెంబ్లీ సమావేశాల తాజా వార్తలు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి జరగనున్నట్లు సమాచారం. సుమారు 11 చట్టాల్లో సవరణలు, రెండు మూడు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను చర్చకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు