ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల... - ఏపీ తాజా వార్తలు

ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేశారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Ap assembly session
Ap assembly session

By

Published : Nov 26, 2020, 6:04 PM IST

Updated : Nov 26, 2020, 7:24 PM IST

ఈ నెల 30వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై బీఎసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొవిడ్ దృష్ట్యా 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

మండలి సమావేశాలు కూడా...

మరోవైపు 30వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. ఈ మేరకు శాసనమండలి సమావేశం కోసం గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆస్తి పన్ను పెంపు సహా కొన్ని కీలకమైన బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి రేపు జరగనున్న కేబినెట్​లో చర్చించనున్నారు

ఇదీ చదవండి :తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు

Last Updated : Nov 26, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details